ఎందరో హీరోల చుట్టూ తిరిగిన ఆ కథను బాలకృష్ణ చేస్తాడా?

balakrishna
సరిగ్గా 11 ఏళ్ల క్రితం తమిళంలో “వరలార్” అనే సినిమా రిలీజయ్యింది. స్టార్ హీరో అజిత్ తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసారు. కేలిస్ రవికుమార్ డైరెక్ట్ చేసారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.అసలు అజిత్ యాక్టింగ్ కి అభిమానులే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆడంగిలా కనిపించే నృత్యకారుడి పాత్రలో అజిత్ చెలరేగిపోయి నటించారు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ ‘జెమినీ’ సంస్థ చాలా ప్రయత్నాలు చేసింది.పవన్ కళ్యాణ్ కూడా “వరలార్” చూసి ఇంప్రెస్ అయిపోయి, ఒక దశలో చేయాలని కూడా అనుకున్నారట. ఆ తర్వాత ఈ ప్రపోజల్ రవితేజ దగ్గరకు వెళ్ళింది. ఇంకా చాలామంది హీరోలు కూడా “వరలార్” చేస్తే బావుంటుందని ముచ్చట చూపించారు. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే రకరకాల కారణాల వల్ల రీమేక్ తెరకెక్కనే లేదు.
ఇప్పుడు ఈ హిస్టరీ అంతా ఎందుకంటే – ఇటీవలే “వరలార్” కథతో నందమూరి బాలకృష్ణను కలిసాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. నిర్మాత  సి. కళ్యాణ్ వీళ్లిద్దరి కంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. బాలకృష్ణకూ ఈ కథ నచ్చింది కానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అసలు “వరలార్” కథకు మూలం – అప్పుడెప్పుడో బాలీవుడ్ లో వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమా “త్రిశూల్”. దాన్ని చాలా మార్పులు చేసి “వరలార్” గా తీసారట. అజిత్ లా రిస్కీ పెర్ఫార్మన్స్ చేయడం కష్టం కాబట్టి, “త్రిశూల్” ని బేస్ చేసుకుని బాలకృష్ణ తో సినిమా చేస్తే బావుంటుందనే ఆలోచన ఆ దర్శక నిర్మాతల్లో ఉంది. త్వరలోనే పూర్తి క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY