టాప్ 10 క్రైస్తవ చిత్రాలు

1 . కరుణామయుడు (1978) :
ఈ సినిమా తీయడం కోసం విజయచందర్ చాల కష్టాలు పడ్డారు. 29 లక్షల ఖర్చయింది.సినిమా రిలీజైన 4 రోజులు వరకు ప్లాప్ టాక్. ఆ తర్వాత ప్రభంజనంలా జనం ఎగబడ్డారు. 14 భాషల్లో ఈ సినిమా అనువాదమైంది. ఇంతవరకు 16౦౦ ప్రింట్లు వేశారు. “శ్రీ కృష్ణుడంటే NTR ఎలానో, జీసస్ అంటే విజయచందర్ ” అలా అయిపోయారు.
2 . రాజాధిరాజు :
కరుణామయుడు అఖండ విజయం తర్వాత విజయచందర్ చేసిన మరో క్రైస్తవ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు బాపు తనదైన శైలిలో ఈ సినిమా చేసారు. ఇందులో విజయచందర్ ఏసుక్రీస్తుగా , రాజుగా డ్యూయల్ రోల్ చేసారు.
3 . దయామయుడు: 
విజయచందర్ నేతృత్వంలో వచ్చిన మరో మంచి క్రైస్తవ చిత్రమిది. నటి గౌతమికి ఇదే తొలి సినిమా.
4 . శాంతి సందేశం:
సూపర్ స్టార్ కృష్ణ జీసస్ గా నటించిన సినిమా ఇది. సీనియర్ దర్శకుడు పీ సి రెడ్డి ఈ సినిమా చేసారు. కృష్ణ ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు లో క్రీస్తుగా కాసేపు కనిపించారు.
5 . ముళ్ళ కిరీటం: 
 తెలుగు లో వచ్చిన తొలి క్రైస్తవ చిత్రం ఇది. మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాకు తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా బానే వర్కౌట్ అయ్యింది.
6 .యేసు ప్రభువు: (1973 )
తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసారు.జెమినీ గణేశన్, నంబియార్ , మేజర్ సుంకరరాజన్, జయలలిత, వెన్నిరాడై నిర్మల ఇందులో ముఖ్య తారలు. రాజశ్రీ మాటలు రాసారు.ఈ ఈస్ట్ మెన్ కలర్ చిత్రానికి PA థామస్ దర్శకుడు.
7 .బాలయేసు: (1994 )
ఏసు మహిమల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విజయకాంత్,సరిత, దీప,అనురాధ,రజని వంటి తారలు నటించారు. V  రాజన్ దర్శకత్వం చేసారు.
8 .ఏసు మహిమలు:
అనేక అభ్యుదయ చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేసిన శివకృష్ణ ఏసుక్రీస్తు గా నటించిన సినిమా ఇది.మురళీమోహన్, నరసింహరాజు , సుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శక నిర్మాత నట్టి కుమార్.
9 .మేరీ మాత:
తమిళంలో ప్రజాదరణ పొందిన సినిమా ఇది.
10 . ముళ్ళ కిరీటం (2009 )
 క్రీస్తు నేపథ్యంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ఇది.ఆ చిత్ర దర్శకుడు NS రాజారెడ్డి ఇందులో జీసస్ పాత్ర పోషించారు.

LEAVE A REPLY