భూటాన్ బుల్లి రాజు భార‌తీయుల‌ను ప‌రేషాను చేస్తున్నాడు.

ఆ మధ్య చిన్నారి శాంభ‌వి పూర్వ‌జ‌న్మ‌లో తాను ద‌లైలామ శిశ్యురాలన‌ని పెద్ద హాడావుడి చేసింది. ఇప్పుడు భూటాన్ దేశానికి చెందిన  బుల్లిరాజు కూడా త‌న‌కు పూర్వ జ‌న్మ గుర్తుకువ‌చ్చింద‌ని చెబుతున్నాడు. అల‌నాటి జ్ఞాప‌కాలు త‌న‌ను వెంటాడుతున్నాయంటున్నాడు. భూటాన్ మ‌హారాజు జింగ్మే కేసర్ నంజల్ వాంగ్ చుక్, రాణి జట్సన్ పీమా వాంగ్ చుక్ ముద్దుల కుమారు వాంగ్ చుక్ విరోచిచానా. ఈ బుడ‌త‌డు గ‌త జన్మ జ్ఞాపకాలను అలవోకగా చెప్పేస్తున్నాడు. నిన్నగాక మొన్న చదివిన ఎల్కేజీ యూకేజీ పాఠాలకు మల్లే అప్పజెప్పేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల‌ను చెబుతున్నాడు.
ఈ బుల్లి భూట‌న్ రాజు 824 ఏళ్ల క్రితం భారతదేశంలో పుట్టాడ‌ట‌. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడ‌ట. అంతే కాదు ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలోనూ చదివాననీ చెబుతున్నాడు. తెలంగాణలోని నాగార్జున కొండకొచ్చి.. తానెక్కడ కూర్చుందీ ఎక్కడ చదివింది ఈ బుల్లి రాజు వివరిస్తుంటే నోళ్లు వెళ్లబెట్టడం అందరి వంతైంది. కొండపై తాను తిరిగిన ప్రదేశాన్ని యువరాజుకు తన అమ్మమ్మకు చూపుతూ కలయదిరగడం అందరినీ షాకయ్యేలా చేసింది. తనకు కలలో ఐదు తలల పాము కనిపిస్తోందనీ.. ఈ పాము ఈ కొండపై తిరిగేదని బుల్లిరాజు గుర్తు చేసుకున్నారు.
అక్కడితో ఆగలేదీ ఈ భూట‌న్ బుల్లి యువరాజు. నాగార్జున కొండపై ప్రస్తుతం ఉన్న విగ్రహం బుద్ధుడిది కాదన్నాడు. ఈ విగ్రహం ఒక మాతదిగా చెప్పాడు. ఈ విగ్రహం కొండపై కాకుండా నది మధ్యలో ఉండేదనీ చెప్పాడు. నాటి ఆనవాళ్లు శిధిలమైన విధం చూసి యువరాజు బాధపడ్డం కూడా ఆలోచన రేకెత్తించింది. ఇటు భూట‌న్ బుల్లియువ‌రాజు త‌ల్లిదండ్రులు కూడా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌ను గురించి వివ‌రించారు.  ప్రతి రోజు నాగార్జున కొండకు పడవలో వెళ్లి వచ్చినట్టుగా కలలు వస్తున్నాయని చెప్పేవాడ‌ని అంటున్నారు రాజకుటుంబీకులు.
ఎక్కడ నాగార్జున కొండ.. ఎక్కడ భూటాన్ రాజ కుటుంబం.. ఎక్కడ నలంద విశ్వవిద్యాలయం.. వాటిని ఈ బుల్లిరాజు గుర్తుపట్టడమేంటి? ఇక్కడే పుట్టి విద్యనభ్యసించడమేంటి? ఏంటిదంతా? గత జన్మ జ్ఞాపకాలు అసలు సాధ్యమేనా? మ‌నిషి మ‌ర‌ణించాక మ‌ళ్లీ జ‌న్మ ఉంటుంద‌ని భారతీయ సంప్ర‌దాయాలు చెబుతాయి. కానీ ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మే ఆ బుల్లిరాజుకే తెలియాలి.

LEAVE A REPLY