సెట్ మీద‌కు వెళ్ల‌కుండానే సైలెంటైన బ‌డా సినిమాలు

టాలీవుడ్ లో ఇద్ద‌రు బ‌డా హీరోల సినిమాల‌కు బ్రేకు ప‌డింది. క్రేజీ ద‌ర్శ‌కుల‌తో, కొత్త క‌థ‌ల‌తో దూకుడుగా వెళుతున్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న నెక్ట్స్ మూవీని కృష్ణ‌వంశీ చేతిలో పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘రైతు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రాష్ట్రప‌తి పాత్ర కోసం అమితా బ‌చ్చ‌న్ ను కూడా బాల‌య్య సంప్ర‌దించాడు. కానీ అమితాబ్‌కు ఖాళీ లేక అది ఇంకా స‌స్పెన్స్ లోనే ఉంది. ఈ మూవీ లేటెస్ట్ న్యూస్ ఎంటంటే ‘రైతు’ సినిమా ఆగిపోయింద‌ని ఓ గాసిప్ వినిపిస్తోంది.
బాల‌య్య 101వ సినిమా ‘రైతు’ ఆగిపోయింద‌ని వార్తా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌దైన స్టైల్‌లో ఫ్యామిలీఎంట‌ర్ టైన‌ర్ చిత్రాలు చిత్రీక‌రించే కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో త‌దుప‌రి సినిమాలుండ‌వ‌ని ఫీల్మ్‌న‌గ‌ర్ లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. అయితే ఈవిష‌యంపై అధికారికంగా ఎవ‌రూ అనౌన్స్ చేయ‌లేదు కానీ.. సినిమాకు బ్రేకు ప‌డింద‌న్న‌ వార్త మాత్రం చ‌క్క‌ర్లు కొడుతుంది.
మ‌రో బ‌డా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం ‘గురు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘నేను శైల‌జ’ ఫేం డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ డైరెక్ష‌న్‌లో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాకు వెంకీ క‌మీట్ అయ్యాడు. ఈ మూవీలో నిత్యామీన‌న్‌తోపాటు మ‌రో ఐదుగురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నార‌ని టాక్ వినిపించింది. ‘గురు’ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే ఈ మూవీని ప‌ట్టాలెక్కించాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ వెంకటేష్ పూరి డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్‌. ఈ మూవీకి సురేష్ బాబుతోపాటు వెంక‌టేష్ కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ట‌.
ఇలా ఇద్ద‌రి బడా హీరోల సినిమాల‌కు బ్రేకు పడింద‌ని గాసిప్ వినిపిస్తున్నాయి. ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల‌ను కాద‌ని కొత్త క‌థ‌ల‌కు క‌మీట్ అవుతున్నారా  తెలియాలంటే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే.?

LEAVE A REPLY