‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ రివ్యూ

తారాగణం: సప్తగిరి, రోహిణి ప్రకాశ్
కథ రచయిత: సప్తగిరి
సంగీతం: బుల్గనిన్
ఎడిటర్: గౌతంరాజ్
సినిమాటోగ్రఫి: రామ్ ప్రసాద్
ప్రొడక్షన్స్: సాయి సెల్యూలయిడ్
నిర్మాత: డాక్టర్ కె, రవికిరణె
దర్శకుడు: అరుణ్ పవర్

కమెడియన్స్ హీరో వేషాలు వేయడం టాలీవుడ్‌కి కొత్తేం కాదు. రాజబాబు దగ్గరి నుంచి సునీల్ వరకు చాలా మంది కమెడియన్స్ హీరో పాత్రలు వేసి మెప్పించారు.  నిన్న మొన్న శ్రీ‌నివాస్ రెడ్డి, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి తెగ సంద‌డి చేశారు. ఇక ఇప్పుడు స‌ప్త‌గిరి వంతు వ‌చ్చేసింది. త‌న పేరుతోనే ఓ సినిమా చేశాడు. ఏకంగా తన ఆడియో ఫంక్షన్‌కు ప‌వన్ కల్యాణ్‌ను ఆహ్వానించి ఫుల్ పబ్లిసిటీ కొట్టేశాడు. సెన్షెషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వంగవీటి సినిమాకే గట్టి పోటీ ఇవ్వడానికి వచ్చేశాడు. మరీ టైటిల్‌లో ఉన్న స్పీడ్  సినిమాలో ఉందో లేదో మ‌న రివ్యూలో చూద్దాం.

కథ

ఓ నిజాయితీగ‌ల కానిస్టేబుల్ శివ‌ప్ర‌సాద్ (శివప్రసాద్‌) అత‌ని కొడుకు స‌ప్త‌గిరి (స‌ప్త‌గిరి)ని ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను చేయాల‌ని క‌ల‌లుకంటాడు. కానీ స‌ప్త‌గిరి మాత్రం సినిమాలో న‌టించాల‌ని క‌ల‌లుకంటుంటాడు. త‌మ కాల‌నీకి కొత్త‌గా వ‌చ్చిన పూర్ణిమ (రోషిణి ప్ర‌కాశ్) ల‌వ్‌లో ప‌డి త‌న వెంట ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో ఓ ఎన్‌కౌంట‌ర్‌లో శివప్ర‌సాద్ దారుణంగా చంపేస్తారు. తండ్రి కోరిక నేరవేర్చేందుకు ఇష్టంలేక‌పోయిన స‌ప్త‌గిరి కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరుతారు. త‌న తండ్రి చ‌నిపోవాడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొంత‌మంది క‌ట్ర ఉంద‌ని తెలుసుకుంటాడు. మ‌రీ త‌న తండ్రిని చంపిన వారిపై ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడు అన్న‌దే సప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ క‌థ‌.

విశ్లేషణ

త‌మిళంలో వ‌చ్చిన తిరుడ‌న్ పోలీస్ చిత్రానికి రీమేక్ వ‌చ్చిన సప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ను ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వ‌ర్ చాలా మార్పులు చేశాడు. అల్లరి చిల్ల‌ర‌గా తిరిగే ఓ కుర్రాడు త‌న తండ్రి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై ప్ర‌తీకారం తీసుకునే యాక్ష‌న్ క‌థ‌కు కాస్త కామెడీ రిద్ది వ‌దిలేశాడు. స‌ప్త‌గిరి సినిమా పిచ్చి ఎపిసోడ్స్ బాగా న‌వ్విస్తాయి. మ‌రోవైపు కాల‌నీలోని ప్రేమ‌క‌థ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఇటు తండ్రీ-కొడుకుల మ‌ధ్య సెంటిమెంట్‌ను పండిస్తాయి. స‌ప్త‌గిరి దాన‌వీర శూర‌క‌ర్ణమూవీలోని డైలాగ్ చెప్ప‌డ‌తో ఈల‌లు రానివాళ్లు కూడా ఈల‌లు కొట్టేశారు.
ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్ష‌కులంద‌రికి న‌చ్చుతాయి. కానీ రివేంజ్ ఎపిసోడ్‌ను ద‌ర్శ‌కుడు ఆస‌క్తిగా డీల్ చేయ‌లేక‌పోయాడు. దానికి కూడా కామెడీ ట‌చ్ ఇచ్చాడు. క‌థ‌లో మంచి సీరియ‌స్‌నెస్ ఉంది కానీ స‌ప్త‌గిరి కోస‌మే క‌థ‌ను కామెడీ ట్రాక్ ఎక్కిచిన‌ట్లు అనిపిస్తుంది.

ఇక పాత్ర‌ల విష‌యానిక‌స్తే అజ‌య్ ఘోష్ కి ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం కొత్తేమి కాదు. సో త‌న పాత్ర‌కు స‌రైన న్యాయం చేశాడు. శివ‌ప్ర‌సాద్ తండ్రిపాత్ర‌లో ఇర‌గ‌దీశాడు. శివ‌ప్ర‌సాద్‌తో వ‌చ్చిన ఎమోష‌న్ సీన్స్ అంద‌రిని ఆక‌ర్షించాయి. కానీ హీరోయిన్ పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఎక్క‌డ ఎలివేట్ చేయ‌లేదు. సినిమా అన్న‌క హీరోయిన్ ఉండాలి క‌దా గుర్తు చేసుకొని పెట్టారేమో అన్న‌ట్లు త‌న పాత్ర ఉంది

 

ఓవ‌రాల్ రేటింగ్ 2.5/5

LEAVE A REPLY