నిర్మాత R .R .వెంకట్ మళ్ళీ వస్తున్నాడట ?

టాలీవుడ్ ని ఒక మూమెంట్ లో దడలాడించిన నిర్మాత R .R .వెంకట్. “ది ఎండ్” అనే చిన్న సినిమాతో మొదలైన అతని సినిమా ప్రస్థానం మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు  తీసే స్థాయికి ఎదిగి పోయింది. చిత్రమేమిటంటే – R .R .వెంకట్ పేరు వినడమే కానీ, అతను ఎలా ఉంటాడో సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలీదు.ఈ ఫంక్షన్ లో కూడా అతను ఫాల్గొన్న దాఖలా లేదు. అంతా తెర వెనుకనే ఉంటూ నడిపిస్తుంటాడు. అచ్చిరెడ్డి లాంటి నమ్మకస్తులైన వ్యక్తుల్ని ముందు పెట్టుకొని చాలా సినిమాలు తీసి పారేసాడు. ‘కిక్-2 ‘ , ‘బిజినెస్ మాన్’ , ‘ప్రేమ కావాలి’ లాంటి సూపర్ హిట్లు తీసిన వెంకట్ ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగు పెట్టి, బాగా దెబ్బ తిన్నాడు. అలాగే వరుస ఫెయిల్యూర్ సినిమాలు తీసి ఎంత వేగంగా వచ్చాడో, అంత వేగంగా తెరుమరుగై పోయాడు. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు. క్లోజ్ సర్కిల్ తో తప్ప ఇంకెవ్వరితోటి టచ్ లో లేడు.
అలాంటిది లేటెస్టుగా R .R .వెంకట్ పేరు మళ్ళీ ఇండస్ట్రీ లో నలుగుతోంది. ఈ అయిదారేళ్ళ గ్యాప్ లో వేరే బిజినెస్సుల్లో బాగా డబ్బు గడించిన వెంకట్ మళ్ళీ ఫిల్మ్ మేకింగ్ లోకి ఎంటరవుతున్నారట. ఈసారి చాలా ప్లాన్ గా సినిమాలు చేయాలని తల పోస్తున్నారట. సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి ప్రయత్నం గా నందమూరి బాలకృష్ణ తో ఓ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తనకు ఆత్మేయుడైన SV .కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణ కూడా ఓకే చెప్పేశారట. అయితే వెంకట్ తన ఆర్. ఆర్ . మూవీ మేకర్స్ బ్యానేర్ లో కూడా తనకు సన్నిహితుడైన పుప్పాల రమేష్ బ్యానేర్ పై ఈ సినిమా తీస్తారని ఒక టాక్.

LEAVE A REPLY