అమ్మో ఈ ‘పిట్ట‌గోడ’ ఎక్క‌డం చాలా క‌ష్టం! ‘పిట్ట‌గోడ’ సినిమా రివ్యూ

తారాగ‌ణం: విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, పునర్న‌వి భూపాలం, ఉయ్యాల జంపాల రాజు, జ‌బ‌ర్ధ‌స్త్ రాజు, శివ‌, ఆర్‌.ఎస్‌, శ్రీ‌కాంత్ త‌దిత‌రులు
సంగీతం: ‘ప్రాణం’ క‌మ‌లాక‌ర్‌
ఛాయ‌గ్ర‌హ‌ణం: దినేష్ కుమార్‌
నిర్మాత‌లుః రామ్మోహన్‌
స‌మ‌ర్ప‌ణః డి. సురేష్ బాబ‌
ద‌ర్శ‌క‌త్వంః అనుదీప్ కె.వి.
ఒక ‘నాని’ని, ఒక ‘అవ‌స‌రాల శ్రీనివాస్‌’ని , ఒక ‘రాజ్ త‌రుణ్‌’ని, లాంచ్ చేసిన ఘ‌న‌త రామ్మోహ‌న్‌ది. అలాగే ఒక ‘విరించి వ‌ర్మ‌’ని, ఒక ‘క‌ల్యాణ్ కృష్ణ‌’ని డైరెక్ట‌ర్‌లుగా ఇంట్ర‌డ్యూస్ చేసిన ఘ‌న‌త కూడా రామ్మెహ‌న్‌దే. అలాంటి నిర్మాత అంతా కొత్త‌వాళ్ల‌తో, కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేశాడంటే ఖ‌చ్చితంగా ఓ క్రేజ్ ఉంటుంది. అందుకే ‘పిట్ట‌గోడ’ ఎక్క‌డానికి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. మ‌రి ఈ ‘పిట్ట‌గోడ’ అంద‌రు ఎక్కేస్థాయిలో ఉందో లేదో ఓ లుక్కేద్దాం.

క‌థ విష‌యానికొస్తే…

సింగ‌రేణి కాల‌నీలో ఓ న‌లుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆవారాగా తిరిగే వీళ్ల‌కి క్రికెట్ అంటే పిచ్చి. వీళ్ల‌కు టిప్పు నాయ‌కుడు. వీళ్లు న‌లుగురూ క‌లిసి ఓ క్రికెట్ టోర్న‌మెంట్ కండ‌క్ట్ చేసి, ఆ ఏరియాలో పేరు తెచ్చుకోవాల‌నుకుంటారు. ఆ కాల‌నీకి కొత్త‌గా వ‌చ్చిన దివ్య‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు టిప్పు. ఆ అమ్మాయికి ఐల‌వ్యూ చెబితే క్లాస్ పీకుతుంది. ఆ అమ్మాయి గ‌తానికి, క్రికెట్ టోర్న‌మెంట్‌కి లింక్ ఉండ‌టంతో అర్థాంత‌రంగా టోర్న‌మెంట్ ర‌ద్దు చేస్తాడు టిప్పు. దాంతో ఫ్రెండ్స్‌తో పాటు అంద‌రూ ఛీ కొడతారు. ఫైన‌ల్‌గా దివ్య మ‌న‌సుని గెలుచుకొని, స్నేహితుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడ‌న్న‌ది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణః

టైటిల్ ‘పిట్ట‌గోడ’ అని పెట్టారు. కానీ అలాంటి స‌న్నివేశాలే లేవు. ఏ న‌లుగురు క‌థ‌గా మొద‌లై అక్క‌డినుంచీ ప్రేమ‌క‌థ‌గా ట‌ర్న్ అయ్యి, చివ‌ర‌కు దొంగ‌నోట్ల‌తో ముగుస్తుంది. టైటిల్‌నిబ‌ట్టి మంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన వాళ్ల‌ను ఈ సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తుంది. ఆర్టిస్టుల్లో కానీ, మేకింగ్‌లో కానీ, డైలాగ్స్‌లో కానీ, సాంగ్స్‌లో కానీ ఎక్క‌డ కొత్త‌గా క‌న‌బ‌డ‌వు. చాలా రోటిన్‌గా చ‌ప్ప‌గా సాగిపోతుంది క‌థ‌నం. ‘ప్రాణం’ క‌మ‌లాక‌ర్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ నుంచి ఇలాంటి హంగామా రీరికార్డింగ్‌ని అస్స‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేం. హీరో కొంత‌వ‌ర‌కు ఓకే అనిపించినా, హీరోయిన్ పున‌ర్న‌వి మాత్రం బాగా తేలిపోయింది. ఆమెను ఎందుకు హీరోయిన్‌గా ఎంపిక చేశారో అస్స‌లు అర్ధంకాదు. ఒక షార్ట్ ఫిల్మ్‌గా తీసిన దానిని బాగా సాగ‌దీసి ఈ సినిమాగా తొసారా అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైన కొత్త‌ద‌నం మాత్రం మాత్రం క‌న‌బ‌డ‌లేదు. రామ్మోహ‌న్‌, డి. సురేష్‌బాబు నుంచి ఇంత నాసిర‌కం
ప్రాడక్ట్‌ను అస్స‌లు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేం. అయినా అన్ని సినిమాలూ ‘అష్టాష‌మ్మా’లు, ‘ఉయ్యాల జంపాలా’లు కావాల‌నుకోవ‌డం మ‌న పొర‌పాటు కూడా క‌దా.?

ఓవ‌రాల్ రివ్యూః 1.5/ 5

LEAVE A REPLY