మంచుల‌క్ష్మీ మంచి కోపంలో ఉంది.

అంటీ వ‌య‌స్సులో ఉన్నవారిని కూడా అంటీ అంటే ఫీల‌య్యే రోజులువి. పేరు పెట్టి పిలిచినా ప‌ర్వాలేదు కానీ అంటీ అంటే మాత్రం మ‌న‌సులో బోలెడ‌న్నీ చివాట్లు పెట్టుకుంటారు. కొంద‌రైతే నేను అంటీలా క‌నిపిస్తున్నానా అని వాద‌న‌కు కూడా దిగిపోతారు. ఇప్పుడిదే స్విచ్‌వేష‌న్ ఎదుర్కొంటోంది మంచు లక్ష్మీ.
ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో మంచు ల‌క్ష్మీని… ల‌క్ష్మీఅక్కా అని సంభోదిస్తున్నారు. ఇటు సినీ జ‌నాలు కూడా ల‌క్ష్మీఅక్కా అని ప్రేమ‌గా పిలుచుకుంటున్నారు. త‌న క‌న్నా చిన్న వాళ్లు అలా పిలిస్తే ఓకె. కానీ ప‌ళ్లూడిపోయిన ముస‌లాయ‌న కూడా అక్కా అని అనేసరికి మంచు ల‌క్ష్మీకి మండింది. త‌న కోపాన్నంత‌టిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. “నేను నా పేరును అక్కా అని చేంజ్ చేసుకోవ‌డానికి సీరియ‌స్ గా ఆలోచిస్తున్నాను”. అని బాంబ్ పేల్చింది.” క‌నీసం నోట్లో ప‌ళ్లు లేని ఓ ముస‌లాయిన లాస్ట్ వీక్ న‌న్ను అక్కా అని పిలిచాడు” అని వాపోయింది. చివ‌ర‌గా “అక్కా తొక్కా” అంటూ ట్వీట్ చేసి లాగౌట్ అయింది.
సినీ న‌టుల వ‌య‌స్సు తగ్గ‌ట్టు పిలిస్తే త‌ట్టుకోలేరు. అది మ‌ర్యాద కూడా కాదు. ఈ మ‌ధ్య‌ నంద‌మూరి బాల‌కృష్ణ తాత అయ్యాడు. ఐనా అభిమ‌నుల‌కు ఇప్ప‌టికీ ఆయ‌న‌ బాల‌య్య బాబే. ఎన్టీఆర్‌ని ఆ వ‌య‌స్సులో కూడా అన్న అని సంభోదించారు. ఎన్టీఆర్ తాత‌గారు అని ఎవ‌రు పిల‌వ‌లేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏ వ‌యస్సుకు వ‌చ్చినా త‌న అభిమానుల‌కు పెద్ద అన్న‌య్యే..

LEAVE A REPLY