‘ఖైదీ నెంబ‌ర్ 150’ రివ్యూ

‘ఖైదీ నెంబ‌ర్ 150’ రివ్యూ

తారాగ‌ణం: చిరంజీవి, (ద్విపాత్రాభిన‌యం)
కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ల‌క్ష్మిరాయ్‌, త‌రుణ్ అరోరా, బ్ర‌హ్మానందం, సునీల్‌, అలీ,
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు.
సంగీతం:  దేవిశ్రీ‌ప్ర‌సాద‌
కాస్ట్యూమ్స్ కొణిదెల సుస్మిత
ఛాయాగ్ర‌హ‌ణం ఆర్‌. ర‌త్న‌వేలు
మాట‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌
స‌మ‌ర్ప‌ణ   శ్రీమ‌తి కొణిదెల సురేఖ‌
నిర్మాత‌లు రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌కత్వం వి.వి. వినాయ‌క్

 

ఖైదీనెంబ‌ర్ 150′ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ద‌ర్శ‌కర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు ఒక మాట అన్నారు. ఇలా పదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా న‌టించిన హిస్ట‌రీ ఒక్క చిరంజీవికే త‌ప్ప ఎవ్వ‌రికీ లేదు. అది నిజ‌మే చిరంజీవికి విప‌రీత‌మైన అభిమాన‌గ‌ణం ఉంది. వాళ్లంతా చిరింజీవిని మ‌ళ్లీ హీరోగా స్క్రీన్‌పై చూడాల‌ని ఎన్నాళ్ల నుంచో ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్లేమి చిరంజీవి నుంచి అద్భుతాలు ఎక్స్‌పెక్ట్ చేయ‌డం లేదు. చిరంజీవి స్ట‌యిల్, డ్యాన్స్‌లు, ఫైట్లు, కామెడీతో ఓ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ చేయాల‌ని ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో చిరంజీవిని అడుగుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చిరంజీవి త‌న‌కు కొట్టిన పిండి అయిన మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ఎన్నుకున్నారు. అలాగ‌ని ఇందులో సందేహాల‌కు కొద‌వ‌లేదు. ఇవ‌న్నీ స‌మ్మిళిత‌మైన త‌మిళ సినిమా క‌త్తిని  ‘ఖైదీనెంబ‌ర్ 150’రీమేక్ చేశారు చిరంజీవి.

క‌థ విష‌యానికొస్తే..

‘క‌త్తి శీను’ అనే ఓ చిల్ల‌ర దొంగ కోల్‌క‌తా సెంట్ర‌ల్ జైలు నుంచి త‌ప్పించుకొని హైద‌రాబాద్‌కు వ‌చ్చేస్తాడు. అక్క‌డి నుంచి కొన్నాళ్లు బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేయాల‌నుకుంటాడు. సరిగ్గా అదే స‌మ‌యంలో క‌త్తి శీను పోలిక‌ల‌తో ఉన్న ‘శంక‌ర్‌’పై ఎవ‌రో హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నిస్తారు. శంక‌ర్‌ని హాస్పిట‌ల్లో జాయిన్ చేస్తాడు. శంక‌ర్ రూపంలో వెళితే డ‌బ్బులొస్తాయని ఓ వృద్దాశ్ర‌మానికి వెళ్తాడు. శంక‌ర్‌ పేరుతో వాళ్ల‌ను మాయ చేస్తాడు. శంక‌ర్ డ‌బ్బు చేతిక అంద‌గానే పారిపోవాల‌నుకుంటాడు. రాయ‌ల‌సీమ‌లోని నీరూమ అనే ప‌ల్లెటూర్ లో శంక‌ర్‌.. ఆ ఊరికోసం కార్పొరేట్ సంస్థ‌ల‌తో పోరాటానికి దిగాడ‌న్న విష‌యం తెలుసుకుని క‌త్తిలో శీనులో ప‌రివ‌ర్త‌న  క‌లుగుతుంది. శంక‌ర్ రూపంలో క‌త్తి శీను విలన్ల‌ను ఎలా తుదిముట్టించ‌డ‌న్న‌ది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణః

ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ముందు వ‌ర‌కు సినిమా అంతా రెగ్యుల‌ర్ క‌మ‌ర్సియ‌ల్ ప్యాట్ర‌న్‌లో సాగుతుంది. చిరంజీవి మాస్ స్టెప్పులు, డైలాగులు, కామెడీ పుష్క‌లంగా ఉంటాయి. ఎప్పుడైతే ‘నీరూమ’ ఎపిసోడ్ ని చాలా హార్ట్ ట‌చింగ్‌గా చిత్రీక‌రించారు. సెకండాఫ్‌లో కూడా చిరంజీవి ప‌క్కా మాస్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్య‌మిచ్చారు. క్లైమాక్స్‌లో రైతుల గురించి చిరంజీవి వ‌న్ మ్యాన్ షో 61ఏళ్ల వ‌యస్సులో కూడా చిరంజీవిలో ఏమాత్రం గ్రేస్ త‌గ్గ‌లేదు. త‌న‌దైన శైలిలోనే క‌మెడీని ర‌క్తి క‌ట్టించ‌గ‌లిగాడు. స్టెప్పులు కూడా అద‌ర‌గొట్టేశాడు.
ఫ్యాన్స్‌కి ఏం కావాలో అవ‌న్నీఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఇది కంప్లీట్ మాస్ ఫిల్మ్‌. కాబ‌ట్టి బీసీ క్లాస్ ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర బాగా వ‌ర్కవుట్ అవుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చిరంజీవికి బాగానే జోడీ కుదిరినా కేవ‌లం సాంగ్స్‌కే ప‌రిమిత‌మ‌య్యే పాత్ర. అయినా నీరు నీరు అనే పాట ఎక్స్‌టార్డ‌న‌రీ. అమ్మ‌డూ కుమ్ముడూ పాట చిరు స్ట‌యిల్ హుషారెత్తిస్తుంది. మిగిలిన పాట‌లు ఎక్కడో విన్న ట్యూన్స్ లా అనిపిస్తాయి. ఈ సినిమాలో మెయిన్ మైన‌స్ విల‌న్ పాత్ర‌. హీరోకి ఏమాత్రం దీటుగా లేకుండా పోయింది. దానికి తోడు త‌రుణ్ అరోరా యాక్టింగ్ పేల‌వంగా అనిపిస్తుంది. చాలా రోజుల త‌ర్వాత బ్ర‌హ్మానందం, అలీ కూడా బాగానే న‌వ్వులు కురిపించారు. కుమ్ముడు పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ కాసేపు తండ్రితో క‌లిసి స్టెప్పులేయం ఫ్యాన్స్ కి హుషార్  క‌లిగించే అంశం. ‘ఠాగూర్’ స్థాయిలో కాక‌పోయినా వివి. వినాయ‌క్ త‌న డైరెక్ష‌న్ అద‌ర‌గొట్టేశాడు.

ఓవరాల్ రేటింగ్ 3.5 / 5

LEAVE A REPLY