‘ఇంట్లో దెయ్యం.. నాకేం భ‌యం’ రివ్యూ

తారాగ‌ణం: న‌రేష్, కృతిక మౌర్యాని, రాజేంద్ర‌ప్ర‌సాద్, బ్ర‌హ్మానందం, చ‌ల‌ప‌తిరావు, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్ర‌హ‌ణం దాశ‌ర‌థి శివేంద్ర‌
నిర్మాతః బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
ద‌ర్శ‌కుడుః నాగేశ్వ‌ర‌రెడ్డి
ఈ మ‌ధ్య కాలంలో హార‌ర్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో చాలా మంది హీరోలు ఈ హార‌ర్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ క‌థ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాల‌ను బాగానే ఆద‌రిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ లాంటి కామెడీ ఇమేజ్ ఉన్న హీరో.. నాగేశ్వ‌ర్ రెడ్డి లాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తీసే డైరెక్ట‌ర్ తో క‌లిస్తే దెయ్యంతో ఇంకెంతా కామెడీ పండిస్తారో అని ఒక ఎక్స్‌పెక్టేష‌న్ ఉండ‌టం స‌హజం. ఆ సినిమా లోప‌లికి వెళ్తే..  ఆ దెయ్యం ఎలా ఎంట‌ర్‌టైన్ చేసిందో తెలుస్తుంది.

కథ విషయానికొస్తే …

ఒక బ్యాండ్‌మేళం ట్రూప్ ఉంటుంది. ఆ బ్యాండ్ మేళం ట్రూప్‌కి నాయ‌కుడు న‌రేష్ (అల్ల‌రి న‌రేష్‌). ఓ రోజు అనుకోకుండా ఇందుమ‌తి (కృతిక) అనే అమ్మాయిని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ అమ్మాయి ఒక అనాధ ఆశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ ఉంటుంది. అందులో ఒక పాప‌కి ఆప‌రేష‌న్ కోసం అర్జెంట్‌గా 3ల‌క్ష‌లు కావాల్సి వ‌స్తుంది. అందుకోసం ఓ రౌడీ ద‌గ్గ‌ర అప్పు చేయాల్సి వ‌స్తుంది. ఆ అప్పు తీర్చ‌డం కోసం నానా ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో ఒక ఫోన్ వ‌స్తుంది. దెయ్యాల మంత్రికుడు అనుకొని పొర‌పాటుని ఇత‌నికి ఫోన్ చేస్తారు. త‌మ ఇంట్లో దెయ్యం ఉంద‌ని దానిని త‌రిమికొడితే 10ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇస్తారు. న‌రేష్ త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి దెయ్యాల మాంత్రికుడు వేషంలో ఆ ఇంట్లోకి వెళ‌తారు. అక్క‌డ నిజంగానే దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం వీళ్ల‌ను ఓ ఆట ఆడిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి హీరో షాక్ అవుతాడు. ఆ దెయ్యం త‌న మ‌ర‌ద‌లు స్వ‌ప్ప ఆత్మే. త‌నే ఆమెని డాక్ట‌ర్ చ‌దివిస్తాడు ఓ ద‌శ‌లో త‌న‌తో పెళ్లికి కూడా సిద్ద‌మ‌వుతాడు. అయితే స‌డ‌న్‌గా స్వ‌ప్న మాయం అవుతుంది. ఏమైందో ఏమో తెలియ‌దు. ఇలా దెయ్యం రూపంలో ఎందుకు ప్ర‌త్యేక్ష‌మైంద‌ని తెలుసుకుంటాడు. ఆత్మ రూపంలో ఉన్న స్వ‌ప్న త‌న బావ‌నే పెళ్లాడుతాన‌ని శ‌బ‌ధం చేస్తుంది. ఫైన‌ల్ గా ఏం జ‌రిగింద‌నేది తెర‌మీద చూడాల్సిందే.

విశ్లేష‌ణః

ఈ మ‌ధ్య‌కాలంలో హార‌ర్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సినిమాలు ఎక్కువ‌య్యాయి అని చెప్పుకున్నాం క‌దా.. వాటిల్లో చాలా లీస్ట్ ద‌శ‌కు చేరుకునే సినిమా ఇది. జ‌నాల‌కు హార‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మీద ఎలా విగ‌టు క‌లుగుతుందో ఈ సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. అస‌లు ఎలాంటి త‌ల తోక లేకుండా పేల‌వంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. క‌థ‌, క‌థ‌నంలో ఎక్క‌డా ద‌మ్ములేదు. చిత్రీక‌ర‌ణ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. అల్ల‌రి న‌రేష్ ఎందుకు  ఈ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడో అర్ధం కావ‌డం లేదు. నాగేశ్వ‌ర్‌రెడ్డి కూడా త‌న‌దైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్ ను వ‌దిలేసి, ఈ దెయ్యం స్టోరిని ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కావ‌డంలేదు. అల్ల‌రి న‌రేష్ వ‌రుస ప‌రాప‌జ‌యాల శిక‌లో ఈ మూవీ ఓ క‌లికితురాయిలా నిలిచిపోతుంది. నాగేశ్వ‌ర్ రెడ్డి కూడా త‌న ప్రాభావాన్ని కొల్పోయినట్లే.. అల్ల‌రి న‌రేష్ ఇక‌పై స‌బ్జెక్ట్‌ల విష‌యంలో కేర్ తీసుకోక‌పోతే చాలా వెనుక‌బ‌డే ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం అత‌ని మార్కెట్ డౌన్ అయింది. ఈ సినిమా ఇంకా డౌన్ చేస్తుంది. అస‌లు దెయ్యంతో న‌వ్వించే సీన్లు ఒక్క‌టి కూడా పేల‌లేదు. ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలు చేసిన పెద్ద నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడు. ఎందుకు తీశాడ‌న్నది అర్ధం కావ‌డంలేదు. ఇక‌పై ఇలాంటి సినిమాలు తీయ‌కుంటే అంద‌రికి మంచింది.

ఓవ‌రాల్ రేటింగ్‌1.5/5

LEAVE A REPLY