మిస్ట‌ర్ కూల్‌కు పాదాభివందం చేసిన అభిమాని

అది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను తలపించింది. స్టేడియమంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. కేరింతలతో హోరొత్తిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్‌కు అంత క్రేజ్ ఎందుకంటే? మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్ట్‌న్‌గా చివ‌రి వ‌న్డేలో బ‌రిలోదిగాడు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ జ‌రుగుతున్న బ్ర‌బౌర్న్ స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తారు. టికెట్స్ అన్ని హాట్‌కేక్‌లా అయిపోయాయి.
కెప్టెన్ గా ధోని చివ‌రిసారిగా బ్యాటింగ్‌కు దిగుతున్న స‌మ‌యంలో క్రికెట్ అభిమానులంతా లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోని బ్యాటింగ్ చేస్తున్నంత సేపు స్టేడియం హోరెత్తిపోయింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ ధోనిసేన గెల‌వ‌క‌పోవచ్చు గానీ బోలెడంతా అభిమానాన్ని గెలుచుకున్నాడు ఈ కూల్ కెప్టెన్‌.
ధోని ఆడుతుండ‌గా ఓ అభిమాని స్టాండ్స్ నుంచి దూకేసి, భ‌ద్ర‌త సిబ్బందిని త‌ప్పించుకుని పిచ్ వ‌ద్ద‌కు వ‌చ్చేశాడు. ధోని పాదాల‌ను తాకేసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే మొద‌ట చాలా కూల్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోని.. ఇలా గ్రౌండ్‌లోకి రావ‌డం త‌ప్పంటూ హెచ్చరించి పంపించాడు.

LEAVE A REPLY