బావ, బావ‌మ‌రుదుల బంధు ప్రీతిని లౌక్యంగా కామెంట్ చేసిన గుణ‌శేఖ‌ర్‌

ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుపై ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ లేఖాస్త్రాన్ని సంధించారు. గుణ‌శేఖ‌ర్ సెట్టులే కాదు సెటైర్లు కూడా బాగానే వేస్తార‌ని తేలిపోయింది. గుణ‌శేఖ‌ర్ రాసిన లేఖ ఇప్పుడు ఇండ‌స్ట్రీతోపాటు పొలిటిక‌ల్‌గానూ పెద్ద దుమారం లేపుతోంది. ప్ర‌భుత్వం చేతిలో ఉంటే బంధువ‌లకు భ‌రోసా ఉన్న‌ట్లే అని మ‌రోసారి ప్రూ అయిపోయింది.
అస‌లు విష‌యం ఏంటంటే…
గుణ‌శేఖ‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా  కాక‌తీయ రుద్ర‌మ‌దేవి లైఫ్ స్టోరీని సినిమాగా మ‌లిచాడు. ఈ మూవీని 2015 సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేశారు. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత తెలుగులో వ‌చ్చిన చారిత్రాత్మ‌క చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పురుషాధిక్య స‌మాజంలో బ‌త‌క‌డమే క‌ష్టంగా ఉన్న రోజుల్లో ఓ మ‌హిళ ఓ సామ్రాజ్యాన్ని ప‌రిపాలించార‌లంటే మామూలు విష‌యం కాదు. అలాంటి ధీర‌వ‌నిత క‌థ‌ను సినిమా తీశాన‌ని అందుకు వినోద‌పు ప‌న్ను రాయితీ కోరుతూ గుణశేఖ‌ర్ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేసుకున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రుద్ర‌మ‌దేవి సినిమాకు వెంట‌నే  వినోద‌పు ప‌న్నును ర‌ద్దు చేశారు. ఇక ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మాత్రం ఇదిగో అదిగో అంటూ కాలం వెల్ల‌దీసి, వినోద‌పు ప‌న్నును ముక్కుపిండి వ‌సూలు చేశారు.
అయితే ఇప్పుడు త‌న బావ‌మ‌రిది, వియ్యంకుడు బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు ఏపీ సీఎం చంద్ర‌బాబు వినోద‌పు ప‌న్నును ర‌ద్దు చేశారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, రుద్ర‌మ‌దేవి రెండు సినిమాలు చారిత్రాత్మ‌క నేప‌ధ్యంలో వ‌చ్చిన సినిమాలే.. ఇద్ద‌రూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లే.. కానీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మూవీకి వినోద‌పు ప‌న్నును ర‌ద్దు చేశారు చంద్ర‌బాబు. కానీ రుద్ర‌మ‌దేవి సినిమా విష‌యంలో మాత్రం కాస్త క‌ఠినంగా వ్య‌వ‌హించారు ముఖ్య‌మంత్రి. బావ‌మ‌రిది న‌టించాడ‌నే ఒకే ఒక కార‌ణంతో వినోద‌పు ప‌న్నును ర‌ద్దు చేశారా అని ప్ర‌శ్న‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఈ నేప‌ధ్యంలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో లేఖ రాసి చంద్ర‌బాబునాయుడుకి చుర‌క అట్టించారు. చారిత్రాత్మ‌క క‌థ‌ల‌ను ప్రొత్స‌హిస్తున్నందుకు ధన్య‌వాదాలు తెలుపుతూనే తాను ఆడ‌గాల‌నుకున్న‌ది అడిగేశాడు. శాత‌క‌ర్ణి  మాదిరిగానే రుద్ర‌మ‌దేవి కూడా అమ‌రావ‌తిలో ప్రాంతాన్ని పరిపాలించింద‌న్నారు గుణ‌శేఖ‌ర్‌. ఇందుకు మంగ‌ళ‌గిరి శాస‌న‌మే సాక్ష్యంమ‌ని చంద్ర‌బాబునాయుడుకు గుర్తుచేశారు.
ఇక‌నైనా త‌న ద‌ర‌ఖాస్తుని పునఃప‌రిశీలించి ఏపీలో వ‌సూలు చేసిన వినోద‌పు ప‌న్ను మొత్తానికి స‌మానమైన ప్రోత్సాహ‌క న‌గ‌దుని ఇవ్వాల‌ని కోరారు. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌క‌తంగా ప‌నిచేస్తుంద‌ని, అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల‌ని మెలిక‌పెట్టి వ‌దిలేశాడు గుణ‌శేఖ‌ర్‌.

LEAVE A REPLY