‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ రివ్యూ

ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన డిఫరెంట్ అటెమ్ట్

తారాగ‌ణం: శ్రీ విష్ణు, నారా రోహిత్‌,త‌న్య హోప్‌
సినిమాటోగ్ర‌ఫిః న‌వీన్ యాద‌వ్‌
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిటింగ్ః   కోట‌గిరి వేంక‌టేశ్వ‌ర‌రావు
ప్రొడ‌క్ష‌న్ః అర‌ణ్ మీడియ‌
నిర్మాతః  ప్రశాంతి, క్రిష్ణ విజ‌య్‌
ద‌ర్శ‌కుడుః సాగ‌ర్ కె. చంద్ర‌
న‌క్స‌ల్స్‌, పోలీసు బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే సినిమా ఇది. కానీ సినిమా ప్రారంభంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే సినిమా అనిపిస్తుంది. న‌క్స‌లిజం పాయింట్‌తో ఓ క్రికెట్ పిచ్చోడితో క‌థ‌ని న‌డిపించ‌డం ఆషామాషి విష‌యం కాదు. మ‌రోవైపు ఓ నిజాయితీ గ‌ల పోలీస్ ని చూపిస్తూ.. ఆ నిజాయితీ మ‌రో జీవితాన్ని నాశ‌నం కావ‌డానికి ఎలా కార‌ణమైందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఇలాంటి క్లిష్ట‌మైన ఎపిసోడ్స్‌తో వ‌చ్చేసింది అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు.

కథ విషయానికొస్తే …

రైల్వే కాల‌నీలో రాజు (శ్రీ విష్ణు) అనే కుర్రాడు ఉంటాడు. క్రికెట్ అంటే అత‌నికి పంచ‌ప్రాణాలు. నేష‌న‌ల్ టీంలో దేశం త‌రుపున ఆడాల‌ని అతని క‌ల‌. అందుకోసం విప‌రీతంగా శ్ర‌మిస్తుంటాడు. అత‌నికో అక్క అంటుంది. ఆమె ఐదేళ్ల క్రిత‌మే పారిపోయి న‌క్స‌ల్స్ గ్రూప్‌లో చేరుతుంది. అక్క‌డే న‌క్సల్ నాయ‌కుడుని పెళ్లి చేసుకుంటుంది. ఈ విష‌యాల‌న్నీ రాజుకి, రాజు ఫ్యామిలీకి ఎవ‌రికి తెలియ‌దు. కానీ న‌క్స‌ల్ గ్రూప్‌ని ఏరివేసే స్పెష‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ ఇంతియాజ్‌ కి ఈ విషయం తెలుస్తుంది. రాజుసై అటాక్ చేసి త‌న అక్కకు సంబంధిచిన వివ‌రాల‌ను చెప్పాలంటూ హింసిస్తాడు. త‌న‌కు ఏమి తెలియ‌ద‌ని చెప్పిన వినిపించుకోడు. ఈ నేప‌ధ్యంలో ఇన్‌స్పెక్ట‌ర్ ఇంతియాజ్‌ రాజుమీద ప‌గ పెంచుకుంటాడు. రాజు క్రికెట్ టీంలో సెలెక్ట్ కాకుండ అడ్డుప‌డుతుంటాడు. మ‌రోవైపు న‌క్స‌ల్ గ్రూప్‌కి చెందిన పురుషోత్తంను లొంగ‌దీసుకొని అత‌ని ద్వారా న‌క్స‌ల్ గ్రూప్‌పై అటాక్ చేసి అంద‌రిని చంపేస్తాడు. విష‌యం తెలుసుకున్న రాజు ఇన్‌స్పెక్ట‌ర్ పై రివేంజ్ తీసుకోవ‌డానికి అశోక్‌రెడ్డి అనే రాజ‌కీయ‌నాయ‌కుడి స‌హాయంతో  గ్యాంగ్ స్టర్గా ఎదుగుతాడు. ఇన్‌స్పెక్ట‌ర్ ఇంతియాజ్‌ను విధుల నుంచి త‌ప్పిస్తారు. న‌గ‌రంలోనే రాజు ఓ బ‌డా గ్యాంగ్ స్టర్ గా ఎదిగిపోతాడు. ఆ త‌ర్వాత ఇంతియాజ్‌ మ‌ళ్లీ ఉద్యోగంలోకి చేరి రాజును చంపేస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెర‌పై చూడాల్సిందే..

విశ్లేష‌ణః

నిజం చెప్పాలంటే చాలా క్లిష్ట‌సాధ్య‌మైన క‌థ ఇది. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైన‌ప్ప‌టికి చాలా బాగా డీల్ చేశాడు. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ఇంత‌కుముందు రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ‘అయ్యారే’ సినిమా చేశాడు. ఐతే క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోయినా మంచి టెక్నిషియ‌న్ అని పేరు తెచ్చుకున్నాడు. నిజం చెప్పాలంటే చాలా అనుభ‌వ‌జ్ఞుడైన ద‌ర్శ‌కుడు చేయాల్సిన సినిమా ఇది. మణిర‌త్నం నాయ‌కుడు త‌ర‌హా క‌థాంశం ఇది. అయినా ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశాడు. ఇంకా కాస్త శ్ర‌ద్ధ పెట్టుంటే బెట‌ర్ సినిమా అయ్యేది. నారా రోహిత్ లాంటి హీరో ఇంతియాజ్‌ అనే నెగిటివ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం నిజంగా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. బాలీవుడ్ త‌ర‌హాలో డిఫ్రెంట్ రోల్ చేసే హీరోల ట్రెండ్ మ‌న‌ద‌గ్గర కూడా వ‌చ్చింద‌నే ఆశ‌ని క‌లిగించింది. ఈ విష‌యంలో నారా రోహిత్‌ను మెచ్చుకోవాలి. సినిమా అంతా రైల్వే రాజు క్యారెక్ట‌ర్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్ర‌లో శ్రీ విష్ణు త‌న వంతు బాధ్య‌త‌ను బాగానే నిర్వ‌ర్తించాడు కానీ అది చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌.. ఆ క్యారెక్ట‌ర్‌లో ఇంకా పెద్ద హీరో న‌టిస్తే బాగుండు అనిపిస్తుంది. అలా అని శ్రీ విష్ణు న‌ట‌న‌ను త‌క్కువ చేయ‌లేం. కానీ ఈ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌ను స్టార్ హీరో చేసుంటే సినిమా ఇంకా పెద్ద లెవ‌ల్‌లోకి వెళ్లేదని అనిపిస్తుంది. రీ-రికార్డ్ంగ్, ఇత‌ర అంశాలలో కూడా చాలా మెరుగైన ప‌నిత‌నం క‌నిపించింది. మొత్తానికి ఈ మూవీ ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన డిఫరెంట్ సినిమా.

ఓవరాల్ రేటింగ్ 3 / 5

LEAVE A REPLY