వెహిక‌ల్ నంబ‌ర్ ప్లేట్స్‌లో ఏపీ ఛేంజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌న్నాహాలు

వాహ‌నాల రిజిస్ట్రేషన్ నంబ‌ర్ ప్లేట్స్‌ను ఏపీ నుంచి టీఎస్‌గా మార్పు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రంగం సిద్ధంచేసింది. 2014 జూన్ 2 ముందు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న నంబ‌ర్ల‌ను మార్చుకోవాల్సిందిగా రాష్ట్ర ర‌వాణా శాఖ అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు అనుగుణంగా ఆన్‌లైన్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో త‌మ వాహ‌నాల‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న ప్ర‌తి ఒక్క‌రు తిరిగి టీఎస్ నంబ‌ర్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఎప్పుడో ఉత్త‌ర్వులు జారీ చేసింది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెర‌పైకి రావడంతో ఆ ఉత్వ‌ర్వుల‌ను కొద్దిరోజులు ప‌క్క‌న పెట్టేసింది ప్ర‌భుత్వం.  ఇప్పుడు కొత్త‌జిల్లాల ఏర్పాటు కూడా ముగిసిపోవ‌డంతో వాహ‌నదారులు తిరిగి రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు ర‌వాణాశాఖ చ‌ర్య‌లు ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ స‌ర్వీసు అందుబాటులోకి రాగానే నోటిఫికేష‌న్ రిలీజ్ చేస్తామ‌ని రవాణాశాఖ చెబుతోంది.  నిర్ణిత స‌మ‌యంలో నంబ‌ర్ మార్చుకోకుంటే చ‌ర్య‌లు తీసుకోవాలా వ‌ద్దా.! అనే ఆలోచ‌న‌లో ప‌డింది ర‌వాణాశాఖ‌.
అయితే నంబ‌ర్ ప్లేట్స్ మార్పున‌కు అయ్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని వాహ‌నదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అద‌న‌పు భారం వాహ‌న‌దారుల‌పై ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు సైతం ఒత్తిడిచేస్తున్నాయి. మ‌ళ్లీ ఇప్పుడు న‌యా నంబ‌ర్ రిజిస్ట్రేష‌న్ చేయాలంటే టూవీల‌ర్ వెహిక‌ల్స్‌కి రూ. 350 ఖ‌ర్చు అవుతుంది. దీనితోపాటు నెంబ‌ర్ ప్లేట్ కొత్త‌ది తీసుకోడానికి అద‌నంగా మ‌రో రూ. 245 వాహ‌న‌దారుల‌పై ప‌డ‌నుంది. ఇక ఫోర్ వీల‌ర్ వాహ‌న‌దారుల‌కు రూ. 550 రిజిస్ట్రేష‌న్ ఖ‌ర్చులు, నంబ‌ర్ ప్లేట్ కోసం మ‌రో రూ. 619 ఖ‌ర్చు కానునున్నాయి. అయితే ఈ  స‌మ‌స్య‌ను కొత్త సాఫ్ట్‌వేర్‌తో కొంత‌మేర త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ర‌వాణ‌శాఖ అధికారులు అంటున్నారు.
ఆదిలాబాద్ TS 01
క‌రీంన‌గ‌ర్ TS 02
వ‌రంగ‌ల్ TS 03
ఖ‌మ్మం TS 04
న‌ల్గొండ TS 05
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ TS 06
రంగారెడ్డి TS 07, TS 08
హైద‌రాబాద TS 09, TS 10, TS 11, TS 12, TS 13, TS 15
మెద‌క్ TS 15
నిజామాబాద్ TS 16
కామారెడ్డి TS 17
నిర్మ‌ల్ TS 18
మంచిర్యాల TS 19
కొమరం భీమ్ TS 20
జ‌గిత్యాల  TS 21
పెద్ద‌ప‌ల్లి  TS 22
రాజ‌న్న సిరిసిల్లా TS 23
వ‌రంగ‌ల్ రూర‌ల్ TS 24
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి  TS 25
మ‌హ‌బూబాబాద్  TS 26
జ‌న‌గాం TS 27
భ‌ద్రాద్రి TS 28
సూర్యాపేట TS 29
యాదాద్రి  TS 30
నాగ‌ర్ క‌ర్నూలు TS 31
వ‌న‌ప‌ర్తి  TS 32
జోగులాంబ గ‌ద్వాల్ TS 33
వికారాబాద్ TS 34
మెద‌క్ TS 35
సిద్ధిపేట్ TS 36

LEAVE A REPLY