“మా నాన్ననా ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక పాత వస్తువుని బహుమతిగా ఇచ్ఛేవారు.

“మా నాన్ననా ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక పాత వస్తువుని బహుమతిగా ఇచ్ఛేవారు.వాటి నుంచే సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకున్నా. ఒకసారి పాత చదరంగం బోర్డు ఇచ్చారు.జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు ఒక్కోసారి తల వంచాల్సి రావడం, వెనుకడుగు వేయడం దీని నుంచి నేర్చుకున్నా.మరొకసారి టైపురైటర్ ఇచ్చారు.టైపు చేసేటప్పుడు ఒక్కసారి తప్పు కొడితే దానిని వెనక్కి వచ్చి సరి చేసుకోలేం.అదే విధంగా జీవితంలోనూ ఏ పనిచేసినా మనసు పెట్టి పొరపాట్లు లేకుండా చేయాలని తెలుసుకున్నా.మరొక పుట్టినరోజునాడు కెమెరా ఇచ్చారు.దానితో అద్భుతమైన చిత్రాలు తీసేవాడిని.కానీ అవి బయటకు తీసేందుకు వచ్చేవికావు.దీని నుంచీ చాలా నేర్చుకున్నా.ఇలా ప్రతి అంశం నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు.”
– షారుఖ్ ఖాన్,ప్రముఖ బాలీవుడ్ నటుడు.

LEAVE A REPLY