తిరుమ‌ల శ్రీ‌వారికి పాత నోట్ల తిప్ప‌లు

tirumala

పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి కొత్త చిక్కులు తీసుకువ‌చ్చింది. ర‌ద్దైన పెద్ద నోట్ల‌ను భ‌క్తులు శ్రీ‌వారి హుండీలో వేసుకుంటూ వెళ్ల‌డంతో భారీగా జ‌మ‌య్యాయి. ఇప్పుడు వీటిని టీటీడీ ఏం చేయాలా అని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. రిజ‌ర్వు బ్యాంకు ఆదేశాల మేర‌కు గ‌త నెల 31 వ‌ర‌కు పాత నోట్ల‌ను బ్యాంకులు స్వీక‌రించాయి. ఆ త‌ర్వాత పాత‌నోట్ల‌ను బ్యాంకులు తీసుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం టీటీడీ వ‌ద్ద  రూ. 4కోట్లు విలువ చేసే పాత నోట్లు ఉన్నాయి. దీంతో టీటీడీ ఈవో సాంబ‌శివ‌రావు పాత నోట్ల‌ను తీసుకోవాల‌ని రిజ‌ర్వు బ్యాంకుకు విజ్ఞ‌ప్తి చేస్తూ లేఖ చేశారు.

2016 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి హుండీ ఆదాయం రికార్డ్ స్టాయిలో రూ.1000 కోట్లకు చేరుకుంది. శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి ప్ర‌తినిత్యం దేశ విదేశాల నుంచి దాదాపు 80వేల మంది భ‌క్తులు వ‌స్తుంటారు.
ప్రత్యేక రోజుల్లో లక్షమందికి పైగా శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలోని హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ కానుకలు నిత్యం రూ.2.50 కోట్లనుండి, 3.50 కోట్లవరకూ ఉంటాయి. ఇక ప్ర‌త్యేక రోజుల్లో ల‌క్ష‌కు పైగా మంది భ‌క్తులు స్వామివారి సన్నిధికి  చేరుకుంటారు.

అయితే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం వ‌ల్ల శ్రీ‌వారి హుండీ ఆదాయం కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి.  డిసెంబ‌ర్ 30 త‌ర్వాత శ్రీ‌వారి హుండీలు కానుక‌లు త‌క్కువ‌గా ప‌డుతున్నాయని ఆల‌య అధికారులు చెబుతున్నారు. ఈరోజు వ‌ర‌కు కూడా 30నుంచి  50ల‌క్ష‌ల వ‌ర‌కు పాత నోట్లు హుండీలో ప‌డుతున్నాయ‌ని ఈవో సాంబ‌శివ‌రావు తెలిపారు. ఈ కానుక‌లను బ్యాంకులు డిపాజిట్ చేసుకోక‌పోవ‌డంతో ఆ డ‌బ్బుల‌న్నీ టీటీడీ వద్దే ఉండిపోయాయి.

మ‌రోవైపు ఆదివారం రోజున వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా భ‌క్తులు భారీగా తిరుమ‌ల‌కు చేరుకోనున్నారు. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా టీటీడీ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. సోమ‌వారం స్వామివారి ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం కోసం కూడా భ‌క్తులు పెద్దఎత్తు తిరుమ‌ల చేరుకోనున్నారు. ఈ స‌మ‌యంలో కూడా భ‌క్తులు పెద్ద‌మొత్తంలో పాత నోట్ల‌ను శ్రీ‌వారి హుండీలో కానుక‌లుగా వేసే ఆవ‌కాశ‌ముంది. ఇప్పటికే టీటీడీ వ‌ద్ద బోలెడంత పాత నోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పండుగ రోజుల్లో వ‌చ్చే పాత నోట్ల‌ను ఏం చేయాల‌ని టీడీడీ అధికారులు త‌ల‌లుప‌ట్టుకుంటున్నారు. ఐతే రిజ‌ర్వు బ్యాంకు తాము చెప్పేవ‌ర‌కు పాత నోట్ల‌ను మీ వ‌ద్దే ఉంచుకోమ‌ని స‌ల‌హా ఇచ్చింద‌ని వార్తాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY